News February 1, 2025

కాకినాడలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

image

ఉమ్మడి తూ.గో జిల్లా కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ఎం.ఆదిమూర్తి(65), ధనలక్ష్మి(60) దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి పిల్లలు విదేశాల్లో ఉంటుండగా ఇక్కడ వారిద్దరే ఉంటున్నారు. అనారోగ్య సమస్యలున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని మనోవేదనకు గురై శుక్రవారం సాయంత్రం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాలను వెలికితీయించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 6, 2025

జూబ్లీహిల్స్ బై పోల్స్: కేసీఆర్ ప్రచారంపై సస్పెన్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రచారం ఊపందుకుంది. ప్రధాన మూడు పార్టీల నుంచి ప్రముఖ నాయకులు చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఇటువైపు చూడలేదు. కేసీఆర్ ప్రచారంపై కార్యకర్తలు, నాయకులకు ఇంకా క్లారిటీ లేదు. కేసీఆర్ ప్రచారం చేస్తారా?, లేదా అనేది ఇప్పటికి సస్పెన్స్ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రచారం మరో 3 రోజుల్లో ముగియనుంది.

News November 6, 2025

ఇదేం నిబంధన.. ‘7 క్వింటాళ్ల పరిమితిపై’ రైతుల ఆవేదన

image

నల్గొండ: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి సేకరణలో ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడంపై ఉమ్మడి జిల్లా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధన ‘దిక్కుమాలిన నిబంధన.. ఏడ్చినట్టే ఉంది’ అని రైతులు మండిపడుతున్నారు. తేమశాతం, పింజ పొడవు నిబంధనలతో ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా, ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కడ అమ్ముకోవాలని వారు సీసీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు.

News November 6, 2025

NLG: అట్టహాసమే.. కానరాని ‘వికాసం’!

image

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులు రాజీవ్ యువ వికాసం పేరిట ధరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ పథకంతో స్వయం ఉపాధికి బాటలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో సుమారు 80 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.