News December 4, 2025
కాకినాడ: అక్కడే ఎందుకిలా జరుగుతోంది.. సర్వత్రా చర్చ!

ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌ను వరుస ఘటనలు కలవరపరుస్తున్నాయి. తాజాగా చేబ్రోలు PHCలో వైద్యం అందక వ్యక్తి మృతి చెందడంతో జనసైనికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిఠాపురం ఆసుపత్రిలో మహిళ ప్రసవించి చనిపోవడం, కొత్తపల్లిలో పాఠశాలకు తాళం వేయడం, హెడ్మాస్టర్ కులం పేరుతో దూషించడం వంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. ఈ పరిణామాలపై డీసీఎం దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News December 4, 2025
వరంగల్: రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్

జీపీ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్‌ను జిల్లా పరిశీలకులు బాల మాయాదేవి, కలెక్టర్ సత్య శారదలు కలెక్టరేట్ వీసీ హాల్‌లో నిర్వహించారు. వరంగల్, నర్సంపేట డివిజన్ల మండలాల వారీగా సర్పంచ్, వార్డు స్థానాలకు ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోల కేటాయింపులు పూర్తయ్యాయి. స్థానికేతర సిబ్బందిని ప్రాధాన్యంగా ఎంపిక చేస్తూ, 91 పంచాయతీలకు 20% రిజర్వ్ స్టాఫ్‌తో ర్యాండమైజేషన్ జరిపారు.
News December 4, 2025
సర్పంచ్.. ప్రజాస్వామ్యానికే ‘పంచ్’!

TG: సర్పంచ్ ఎన్నికల వేళ కొందరు ప్రజాస్వామ్యానికే సవాల్ విసురుతున్నారు. ఎలక్షన్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి నిత్యం ఎక్కడో ఒకచోట సర్పంచ్ పదవులకు వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి. ఓటర్లతో పనిలేదు.. డబ్బు ఉన్నోడిదే రాజ్యం అనేలా మారిపోయింది పరిస్థితి. పైసా లేకున్నా నిజాయతీగా ఎన్నికల్లో పోటీ చేద్దామనుకునేవాడికి నిరాశే ఎదురవుతోంది. కఠిన చట్టాలతోనే వేలం పాటలకు అడ్డుకట్ట పడుతుందని ఓటర్లు అంటున్నారు.
News December 4, 2025
కలెక్టరేట్‌లో ప్రతిష్టాపనకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యిందని, విగ్రహ ప్రతిష్టాపన పనులు చివరి దశకు చేరాయని కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం నిర్మాణ పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. కలెక్టరేట్‌కు మరింత ఆకర్షణ వచ్చే విధంగా విగ్రహ ఏర్పాటు ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


