News September 30, 2024
కాకినాడ: ‘అమ్మ నన్ను ట్రైన్ ఎక్కించి వాటర్ కోసం వెళ్లి రాలేదు’
బెంగళూరు రైల్వే స్టేషన్‌లో ఓ తల్లి వాటర్ బాటిల్ కోసం దిగగా.. ఆమె 14ఏళ్ల కుమార్తె కాకినాడకు చేరింది. RPF పోలీసులు కాకినాడలో ఆ బాలికను గమనించి వివరాలు సేకరించారు. ‘బెంగళూరు వైట్‌ఫీల్డ్ స్టేషన్‌లో అమ్మ నన్ను రైలు ఎక్కించి వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఈ లోగా రైలు కదలడంతో కాకినాడ చేరా’నని పేర్కొంది. బాలిక వివరాలు చెప్పలేకపోతుందని, సఖీ, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించామని తెలిపారు.
Similar News
News December 21, 2024
తొండంగి: రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
తొండంగి మండలం బెండపూడి హైవేపై జరిగిన శుక్రవారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పని ముగించుకొని ఇంటికి బైక్‌పై వస్తుండగా కత్తిపూడి నుంచి వస్తున్న వీరబాబు బైక్ బలంగా ఢీకొన్నాయి. స్థానికులు వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. SI జగన్మోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 21, 2024
తూ.గో: ఉమెన్స్ బీచ్ వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు
సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉప్పలగుప్తం మండలం సూరసేన యానాం బీచ్‌లో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఉమెన్స్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎస్.ఎస్ వై. బీచ్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫిజికల్ డైరెక్టర్లు శుక్రవారం బీచ్‌లో ఏర్పాట్లు చేశారు. 8 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని నిర్వహకులు తెలిపారు.
News December 20, 2024
కాట్రేనికోన: సముద్రంలో చిక్కుకున్న 14 మంది సురక్షితం
కాట్రేనికోన మండలం కొత్తపాలెం వద్ద భైరవపాలానికి 7.6 నాటికన్ మైళ్ల దూరంలోని సముద్ర జలాల్లో యాంత్రిక లోపంతో రెండు మత్స్యకార బోట్లు నిలిచి పోయాయి. వాటిలో చిక్కుకున్న 14 మంది మత్స్యకారులను ఎస్పీ కృష్ణారావు పర్యవేక్షణలో మెరైన్ ఇన్‌స్పెక్టర్ మూర్తి ఆధ్వర్యంలో ఇండియన్ కోస్టల్ గార్డు సిబ్బంది, ఓడలరేవు కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, అల్లవరం పోలీసులు సురక్షితంగా బోటులో ఒడ్డుకు చేర్చి గమ్యస్థానాలకు పంపారు.