News December 18, 2025

కాకినాడ: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.

image

కారుణ్య నియామకం, కుటుంబ పింఛను మంజూరు కోసం రూ.40 వేలు లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ అధికారి, మరో ఇద్దరు సిబ్బంది ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుల ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ బృందం గురువారం వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితులను జుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.

Similar News

News December 19, 2025

గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్: కపిల్ దేవ్

image

టీమ్ ఇండియాకు గంభీర్‌ మేనేజర్ మాత్రమేనని క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అన్నారు. ‘కోచ్ అనే పదాన్ని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. గంభీర్ కోచ్ కాదు.. మేనేజర్ అంతే. లెగ్ స్పిన్నర్ లేదా వికెట్ కీపర్‌కు గంభీర్ కోచ్ ఎలా అవుతారు. స్కూల్, కాలేజీల్లో నేర్పేవాళ్లు నా దృష్టిలో కోచ్. ఆటగాళ్ల బాగోగులు చూసుకోవడమే ప్రస్తుత కోచ్ పని. వాళ్లను ప్రోత్సహించి, స్ఫూర్తి నింపి, సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి’ అని చెప్పారు.

News December 19, 2025

ఏలూరులో నేడు ఈ కార్యక్రమం వాయిదా

image

ఏలూరులో నేడు జరగాల్సిన జిల్లా స్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శన(సైన్స్ ఫెయిర్) వాయిదా పడినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలను తిరిగి ప్రారంభించే తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ మంగళ, బుధవారాల్లో జరగాల్సి ఉండగా..సోమవారం లోపు ఈ పోటీలు నిర్వహించాల్సి ఉందని టీచర్లు చెబుతున్నారు.

News December 19, 2025

భూపాలపల్లి: రెండు ఓట్లతో సర్పంచ్‌గా గెలుపు

image

జిల్లాలోని మహా ముత్తారం మండలం పోలారం పంచాయతీ సర్పంచిగా అంబాల రాజబాబు రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019 జనవరి 25న జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోగా, ఈసారి ప్రజలు ఆయన్ను రెండు ఓట్ల తేడాతో గెలిపించారు. సర్పంచ్ పదవి వరించడంతో రాజబాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.