News March 22, 2024

కాకినాడ: ఒకే కుటుంబం నుంచి 5గురు MLAలు

image

ప్రత్తిపాడు నియోజకవర్గానికి ‘పర్వత’ కుటుంబం ఐదుగురు MLAలను అందించింది. 1955లో పర్వత గుర్రాజు గెలవగా, ఆయన వారసుడు పర్వత సుబ్బారావు 1994లో గెలిచారు. సుబ్బారావు భార్య బాపనమ్మ 1999లో విజయం సాధించారు. ఆమె కుమారుడు పర్వత సత్యన్నారాయణ మూర్తి 2009లో గెలుపొందారు. అదే కుటుంబం నుంచి పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌కి 2019లో విజయం దక్కింది. దీంతో ఆ కుటుంబం నుంచి ఐదుగురు నేతలు అసెంబ్లీలో అడుగు పెట్టినట్లయింది.

Similar News

News April 4, 2025

రాజమండ్రి: ఫార్మాసిస్టు నాగాంజలి మృతి

image

మృత్యువుతో 12 రోజుల పాటు పోరాడిన ఫార్మాసిస్టు నాగాంజలి (23) శుక్రవారం మృతి చెందింది. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రి AGM దీపక్ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నాగాంజలి గత నెల 23వ తేదీ నుంచి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నాగాంజలి మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

News April 4, 2025

తూ.గో: నేడు పిడుగులు పడే అవకాశం

image

తూ.గో జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎక్స్‌లో పోస్టు చేసింది. పిడుగుల పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే. తూ.గో జిల్లా నల్లజర్లలో నిన్న మధ్యాహ్నం పలు గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలకు పంటలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 4, 2025

గోపాలపురం: ఫ్యాన్‌కు ఉరేసుకొని మహిళ సూసైడ్

image

మనస్తాపానికి గురై ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గోపాలపురం మండలం నందిగూడెం గ్రామంలో కోళ్ల ఫారంలో పనిచేస్తున్న సతామి కోటల్ (30)తో సునీల్ కోటల్ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నాడు. బుధవారం వీరి మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో మనస్తాపం చెందిన ఆ మహిళ ఇంటిలో ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోళ్ల ఫారం యజమాని సమాచారంతో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

error: Content is protected !!