News March 1, 2025
కాకినాడ : ఒక్క నిమిషం.. వారి కోసం.!

కాకినాడ జిల్లాలో 56 కేంద్రాల్లో 44,531 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
Similar News
News March 1, 2025
అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని కొయ్యూరు ఎస్‌ఐ పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి, సహకరించాలని సూచించారు.
News March 1, 2025
రాజా సాబ్.. 3 గంటలు!

ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌కు మారుతి దర్శకత్వం వహిస్తుండగా.. మాళవిక మోహనన్ హీరోయిన్. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని సమాచారం. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉంది.
News March 1, 2025
ఏటేటా తగ్గుతున్న పీఎం కిసాన్ లబ్ధిదారులు!

నల్గొండ జిల్లాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్య ఏటేటా తగ్గుతోంది. ఈ పథకం ప్రారంభించిన సమయంలో జిల్లాలో 2,78,667 మంది అర్హులు ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు చనిపోయిన, భూములను అమ్ముకున్న వారిని, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను ఏటా జాబితా నుంచి తొలగిస్తున్నారు. దీంతో 19వ విడతలో 1,08,651 మంది రైతులకు మాత్రమే అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది.