News December 9, 2025

కాకినాడ: కంగారు పెడుతున్న ఎన్నికల సర్వే ?

image

ప్రస్తుతం శాసనసభ, పార్లమెంటు ఎన్నికలు లేవు. ఇప్పట్లో జరిగే అవకాశం కూడా లేదు. కానీ ఉమ్మడి తూ.గో జిల్లాలో ఐవిఆర్ సర్వే జరుగుతోంది. మీరు ఎవరికి ఓటు వేస్తారు? వైసిపి అయితే ఒకటి, ఇతరులు అయితే రెండు, కూటమికి అయితే మూడు నొక్కండి అంటూ ఫోన్లు వస్తున్నాయి. దీంతో ప్రజలు కంగారు పడుతున్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు కదా అన్న ఆలోచనలో పడ్డారు. అసలు ఈ సర్వే ఎవరు చేస్తున్నారు? అన్నది తెలియాల్సి ఉంది.

Similar News

News December 11, 2025

సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం: పవన్

image

AP: గతంలో ఎన్నడూ లేని విధంగా 10వేల మందికి పైగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని Dy.CM పవన్ అన్నారు. ‘ప్రమోషన్ల ఆనందం ప్రజలకు అందించే సేవల్లో కనబడాలి. నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలి. గత ప్రభుత్వంలో పోస్టింగ్, ప్రమోషన్‌కు ఓ రేటు కార్డు ఉండేది. కూటమి పాలనలో సీనియారిటీ, సిన్సియారిటీకే ప్రాధాన్యమిచ్చాం’ అని ఉద్యోగులతో మాటా-మంతి కార్యక్రమంలో ఆయన అన్నారు.

News December 11, 2025

BHPL: ఓటు హక్కు వినియోగానికి ఇవి తప్పనిసరి: కలెక్టర్

image

ఈనెల 11, 14, 17వ తేదీల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా చూపించాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఓటర్, ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఇండియన్ పాస్‌పోర్ట్, దివ్యాంగుల గుర్తింపు కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, రేషన్ కార్డుల్లో ఏదైనా తీసుకెళ్లాలని సూచించారు..

News December 11, 2025

MHBD: నాన్నపై ప్రేమతో!

image

MHBD(D) కొత్తగూడ(M) వెలుబెల్లికి చెందిన రాజు తన తండ్రిపై ఉన్న ప్రేమను అద్భుతంగా చాటుకున్నాడు. కొన్ని నెలల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, బాధను దిగమింగుకుని వినూత్నంగా నివాళులర్పించాడు. తమ పొలంలో నారుమడి వేస్తూ ఏకంగా తన తండ్రి ఎల్లయ్య పేరునే నారుతో తీర్చిదిద్దాడు. ఈ భావోద్వేగ ఘట్టం ఇప్పుడు ఆ ప్రాంతంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రిపై కొడుకు చూపిన ఈ ప్రేమాభిమానం పలువురిని కదిలిస్తోంది.