News March 16, 2025
కాకినాడ: కన్నతండ్రే కిల్లర్‌లా చంపేశాడు..!

కన్నతండ్రే కిల్లర్‌లా ఇద్దరు చిన్నారులను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన కాకినాడలో జరిగిన విషయం తెలిసిందే. చంద్రకిశోర్ ఇద్దరి చిన్నారులను ప్రముఖ స్కూల్‌లో చదివిస్తున్నాడు. భవిష్యత్తులో లక్షలు కట్టి చదివించగలనా? అనే భయం మొదలైందని బంధువులు చెబుతున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలకు కాళ్లుచేతులకు తాళ్లు ఎలా కట్టగలిగాడు? వారిని బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఎలా చంపగలిగాడనేది అనుమానంగా ఉందని వారు చెప్పారు.
Similar News
News September 15, 2025
పలు కాలేజీలు బంద్.. ఎగ్జామ్స్‌కు మినహాయింపు!

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే పరీక్షలకు ఈ బంద్ మినహాయింపు ఉంటుందని తెలిపాయి. అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చల తర్వాత బంద్‌పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
News September 15, 2025
అందాల రాణి.. ఆర్మీ ఆఫీసర్‌గా..

పుణే (MH)కు చెందిన కాశీష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. మోడలింగ్, యాక్టింగ్‌లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్‌లో PhD ఛాన్స్ వచ్చింది. కానీ వీటిని లెక్క చేయకుండా దేశం కోసం ఆర్మీలో చేరాలనుకున్నారు. 2024లో CDS ఎగ్జామ్‌లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పని చేస్తున్నారు.
News September 15, 2025
నిర్మల్ జిల్లాలో మోస్తరు వర్షాలు

గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో 75.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. దిలావర్పూర్ మండలంలో అత్యధికంగా 23.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, మామడలో 17.8, కుంటాల 7.6, నిర్మల్ 5.4, తానూర్, సోన్ మండలాల్లో 3.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా సగటు వర్షపాతం 4.0 మిల్లీమీటర్లుగా ఉందని అధికారులు పేర్కొన్నారు.