News February 13, 2025

కాకినాడ: కన్నబాబుకు హైకమాండ్ కీలక బాధ్యతలు

image

మాజీ మంత్రి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు పార్టీ పదోన్నతి కల్పించింది. ఆయనను ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ గా నియమించింది. కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఆయన స్థానంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను నియమించారు. కన్నబాబుకు కీలక పదవి ఇవ్వడంతో ఆయన అభిమానులు, జిల్లా వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News November 11, 2025

పెద్దపల్లి: పత్తి గరిష్ఠ ధర రూ.6,762

image

పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తికి గరిష్ఠంగా రూ.6,762(క్వింటాల్‌), కనిష్ఠంగా రూ.5,051, సగటు ధర రూ.6,762గా పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి మనోహర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 475 మంది రైతులు మొత్తం 1647.90 క్వింటాళ్ల పత్తిని విక్రయించగా, మార్కెట్‌ యార్డులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా లావాదేవీలు సజావుగా సాగాయన్నారు.

News November 11, 2025

ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎంలు

image

ఢిల్లీ పేలుడు ఘటనపై తెలుగు రాష్ట్రాల సీఎంలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ రాజధానిలో పేలుడు ఘటన షాక్‌కు గురిచేసిందని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News November 11, 2025

భద్రకాళి దేవస్థానంలో ఘనంగా కార్తీక దీపోత్సవం

image

దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ భద్రకాళి దేవస్థానంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రేశ్వర స్వామివారికి అసంఖ్యాక రుద్రాక్షలతో అభిషేకం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కూచిపూడి నృత్యం, కర్ణాటక సంగీత కచేరిని ఏర్పాటు చేశారు.