News January 26, 2025
కాకినాడ కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం

కాకినాడ కలెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా పురస్కారం అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ ఎన్నికల అధికారిగా ఆయన అవార్డు స్వీకరించారు. అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అర్బన్ తాహశీల్దార్‌లకు అవార్డులు దక్కాయి.
Similar News
News December 31, 2025
ESIC MC& హాస్పిటల్‌లో 95 పోస్టులు

<
News December 31, 2025
నిమ్మలో కలుపు ఉద్ధృతి తగ్గాలంటే..

నిమ్మ తోటలకు డ్రిప్ పద్ధతిలో నీరు అందిస్తే 25-30% కలుపు తగ్గుతుంది. చెట్ల పాదుల్లో వరి పొట్టు, ఊక, ఎండిన ఆకులు, వేరుశనగ పొట్టు, ఎండిన పంట వ్యర్థాలను వేస్తే అది మల్చింగ్‌గా ఉపయోగపడి కలుపు తగ్గుతుంది. అలాగే అవి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడతాయి. 100 మైక్రాన్ల ప్లాస్టిక్ మల్చింగ్ షీటును కూడా వాడి కలుపును కట్టడి చేయొచ్చు. ఆక్సిఫ్లోరోఫిన్ మందును లీటరు నీటికి 1-1.5ML కలిపి చెట్ల పాదుల్లో పిచికారీ చేయాలి.
News December 31, 2025
చిత్తూరు జిల్లాలో 128 మందిపై డ్రగ్స్ కేసులు

చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది 128 మంది మీద మాదక ద్రవ్యాల చట్టానికి సంబంధించి 42 కేసులను నమోదు చేశారు. 98 కేజీల గంజాయి, 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 35 ఎక్సైజ్ కేసులు నమోదు కాగా.. 327 మందిని అరెస్ట్ చేశారు. 4400 లీటర్ల సారా, 2124 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 21 వాహనాలను ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 2024తో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది.


