News December 11, 2025
కాకినాడ కలెక్టర్‌కు చిట్టచివరి(26) ర్యాంకు

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సాగిల్లి షాన్ మోహన్ గత మూడు నెలల్లో(సెప్టెంబర్-డిసెంబర్) 44 ఫైళ్లు స్వీకరించి 42 ఫైళ్లు పరిష్కరించారు. అయితే, ఆయన సగటు ప్రతిస్పందన సమయం అత్యధికంగా 11 రోజులు 16 గంటల 44 నిమిషాలుగా నమోదైంది. ఈయన పనితీరును బట్టి రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానం(26)లో నిలిచారు.
Similar News
News December 14, 2025
మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తాం: వివేక్

TG: రాబోయే మూడేళ్లలో 17 లక్షల ఇళ్లు నిర్మిస్తామని మంత్రి వివేక్ తెలిపారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తామన్నారు. వికారాబాద్‌లోని నస్కల్‌లో ATC శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడారు. యువతకు సరైన ఉద్యోగాలు రావాలంటే స్కిల్ తప్పనిసరని చెప్పారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టకపోగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేదని విమర్శించారు. త్వరలోనే తమ ప్రభుత్వం మరో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు.
News December 14, 2025
శ్రీ సత్యసాయి: కెప్టెన్ దీపిక ఇంటికి చేరిన పవన్ కానుకలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ <<18548058>>దీపిక<<>> కుటుంబానికి టీవీ, ఫ్యాన్, గృహోపకరణాలు, నిత్యావసరాలు, వస్త్రాలను అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ చేతుల మీదుగా అందించారు. అలాగే తమ ఊరు తంబలహట్టి తండాకు రోడ్లు బాగాలేవని దీపిక ఆవేదన వ్యక్తం చేయగా వెంటనే రూ.6.2 కోట్లతో నూతన రోడ్లు మంజూరు చేశారు. రూ.5లక్షల చెక్కును దీపికకు అందజేసి భరోసా ఇచ్చారు.
News December 14, 2025
అరక అరిగిన గరిసె విరుగును

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.


