News December 11, 2025

కాకినాడ కలెక్టర్‌కు చిట్టచివరి(26) ర్యాంకు

image

సీఎం చంద్రబాబు గత మూడు నెలలుగా రాష్ట్రంలోని కలెక్టర్ల పనితీరును బట్టి వారికి ర్యాంకులు కేటాయించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ సాగిల్లి షాన్ మోహన్ గత మూడు నెలల్లో(సెప్టెంబర్-డిసెంబర్) 44 ఫైళ్లు స్వీకరించి 42 ఫైళ్లు పరిష్కరించారు. అయితే, ఆయన సగటు ప్రతిస్పందన సమయం అత్యధికంగా 11 రోజులు 16 గంటల 44 నిమిషాలుగా నమోదైంది. ఈయన పనితీరును బట్టి రాష్ట్రంలోనే చిట్టచివరి స్థానం(26)లో నిలిచారు.

Similar News

News December 14, 2025

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు: నాగబాబు

image

AP: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని నటుడు, MLC నాగబాబు స్పష్టం చేశారు. శ్రీకాకుళం(D) లావేరులో జరిగిన జనసేన మీటింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘MLAగా పోటీ చేయాలనుకుంటే వచ్చే ఎన్నికల వరకు ఎందుకు? గత ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని. 5-6 ఏళ్ల తర్వాత సంగతి చెప్పమంటే ఏం చెబుతాం. జనసేన ప్రధాన కార్యదర్శిగా కంటే జనసేన కార్యకర్త అనిపించుకోవడంలోనే సంతృప్తి ఉంటుంది’ అని తెలిపారు.

News December 14, 2025

వరంగల్: 18.82% పోలింగ్ @9AM

image

స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశలో పోలింగ్ వరంగల్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు మొత్తం 18.82 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ఓటర్లు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాగా, దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం మండలాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది.

News December 14, 2025

తాండూర్: సర్పంచ్ అభ్యర్థికి అస్వస్థత

image

తాండూర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి మాసు వెంకటస్వామి అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. ఆదివారం పోలింగ్ మొదలైన నేపథ్యంలో వెంకటస్వామి ఇంట్లో నుంచి పోలింగ్ స్టేషన్ బయలుదేరారు. ఈ క్రమంలో వెంకటస్వామి ఒక్క సారిగా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని వెంటనే బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు మెరుగైన చికిత్స కోసం వెంకటస్వామిని మంచిర్యాలకు రిఫర్ చేశారు.