News November 11, 2025

కాకినాడ కలెక్టర్ తీరుపై విమర్శలు!

image

కలెక్టర్ షాణ్మోహన్ వివాదాలలో ఇరుక్కుంటున్నారు. కాకినాడ నగరంలో ఆస్తి పన్నులు పెంచుతామని, పార్కులు ప్రైవేటీకరణ చేస్తామని ఆయన ప్రకటించడం, నగరంలో ఖాళీ స్థలాలు ఉండి వాటిని పరిశుభ్రం చేసుకోకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామనడం విమర్శలకు తావిచ్చాయి. మరోవైపు కలెక్టర్‌గా 7 నియోజకవర్గాలను సమ దృష్టితో చూడడం లేదని, పిఠాపురానికి పెద్దపీఠ వేస్తున్నారని పలువురు ప్రజాప్రతినిధులు ఒకింత ఆగ్రహంగా ఉన్నారట.

Similar News

News November 11, 2025

బిహార్‌ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్‌లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్‌లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.

News November 11, 2025

భద్రాద్రి పాలకమండలి ఏర్పాటుపై పడని ముందడుగు

image

భద్రాద్రి రామాలయానికి ఉమ్మడి ఏపీలో 2012 NOV 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. అనంతరం పాలకమండలి ఏర్పాటుపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 50మందికి పైగా దరఖాస్తు సమర్పించారు. అయినా నేటికి పాలకమండలి ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. 3రోజుల క్రితం సర్కారు సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.

News November 11, 2025

చంద్రగిరిలో అక్రమ మైనింగ్.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

image

ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల ఆధ్వర్యంలో చంద్రగిరిలో రూ.కోట్ల విలువైన మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని JSP నేత దేవర మనోహర్.. తిరుపతి పర్యటనలో ప‌వ‌న్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ విచారణకు ఆదేశించారు. రామచంద్రాపురం, గుండోడుకణం, రాయలచెరువు, గణేషపురం, తిరుచానూరు, తనపల్లి ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాని మనోహర్ తెలపగా.. ప్రజల ఆస్తుల రక్షణలో రాజీ ఉండవద్దని పవన్ హెచ్చరించారు.