News March 4, 2025
కాకినాడ: కొనసాగుతున్న కౌంటింగ్.. దూసుకుపోతున్న పేరాబత్తుల

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరానికి 48,923 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 16,806 ఓట్లు పోలయ్యాయి. 28 టేబుళ్లలో 3వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 76,345 ఓట్లు చెల్లినవి కాగా, 7,655 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. రాజశేఖరం, వీర రాఘవులు మధ్య 32,117 ఓట్ల వ్యత్యాసం ఉంది.
Similar News
News December 13, 2025
నిజామాబాద్: పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా: బీజీపీ అధ్యక్షుడు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సూర్యనారాయణ రూ.138 కోట్ల నిధులు తెచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల పాలన శూన్యమన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
News December 13, 2025
నక్సలిజం పాము లాంటిది: అమిత్ షా

నక్సలిజం ఎవరికీ ప్రయోజనం కలిగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. శాంతి మాత్రమే అభివృద్ధికి మార్గం చూపగలదని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని అంతం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. ‘నక్సలిజం విషపూరితమైన పాము లాంటిది. దాన్ని అంతం చేసిన తర్వాత అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది’ అని బస్తర్ ఒలింపిక్-2025 ముగింపు కార్యక్రమంలో పేర్కొన్నారు.
News December 13, 2025
MBNR: నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం.. 1,508 మంది గైర్హాజర్

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 29 కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా మొత్తం 7,115 మంది దరఖాస్తు చేసుకోగా 5,607 మంది హాజరయ్యారు. 1,508 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.


