News July 7, 2024

కాకినాడ: క్షుద్రపూజలని అనుమానం.. అర్ధరాత్రి గొడవ

image

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు సమీపంలో పోలవరం కాలువ గట్టు వద్ద కొన్నిరోజులుగా సంచార జాతులకు చెందిన కొందరు గుడారాలు వేసుకొని ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వారు ఒక ఎనుబోతును బలిఇచ్చి పూజలుచేస్తుండగా స్థానికులు గుర్తించి ప్రశ్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగి సంచారజాతులకు చెందిన ఓ వ్యక్తి స్థానికుడిపై కత్తితో దాడి చేశాడు. తుని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. విచారణ చేపట్టారు.

Similar News

News October 7, 2024

రంపచోడవరం: CRPF జవాన్ మృతి

image

చింతూరు మండలంలో విషాదం జరిగింది. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లు తగలడంతో సీఆర్పీఎఫ్ జవాను తిరువాల కారాసు (55) ఆదివారం రాత్రి మృతిచెందాడు. వివరాలు.. డొంకరాయి పరిసరాల్లో రాత్రి 2 గంటలకు కూంబింగ్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 7, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 1.62 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 14,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులు నీటిమట్టం కొనసాగుతుందని తెలిపారు.

News October 7, 2024

సామర్లకోటలో 8న మినీ జాబ్ మేళా

image

సామర్లకోట టీటీడీసీలో 8న (మంగళవారం) ఉదయం 10.గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి సంస్థ అధికారి శ్రీనివాస్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు, సీడన్ జేడీఎం కిరణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. వివిధ ఉద్యోగుల్లో పని చేసేందుకు పది, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-35 ఏళ్ల వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.