News March 6, 2025
కాకినాడ : ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ఏలూరు గ్రామీణ మండలం సోమవరప్పాడు వద్ద 16 నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. HYD నుంచి కాకినాడ వస్తున్న బస్సు – లారీని ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2025
వికారాబాద్: ద్వితీయ సంవత్సరం పరీక్షకు 6, 963 మంది విద్యార్థులు

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మొదటి పరీక్షకు 6,963 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ద్వితీయ సంవత్సరం లాంగ్వేజెస్ తెలుగు, సంస్కృతం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News March 6, 2025
నారా భువనేశ్వరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని దంపతులు

విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ టీచర్స్ కాలనీలో గురువారం జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ కేశినేని దంపతులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన నారా భువనేశ్వరికి కేశినేని దంపతులు ఘన స్వాగతం పలికారు.
News March 6, 2025
జైశంకర్‌పై ఖలిస్థానీల దాడి యత్నంపై మండిపడ్డ భారత్

EAM జైశంకర్ UK పర్యటనలో భద్రతా <<15666524>>లోపంపై<<>> భారత్ తీవ్రంగా స్పందించింది. ఖలిస్థానీలవి రెచ్చగొట్టే చర్యలని మండిపడింది. ‘జైశంకర్ పర్యటనలో భద్రతా లోపాన్ని ఫుటేజీలో మేం పరిశీలించాం. వేర్పాటువాదులు, అతివాదుల రెచ్చగొట్టే చర్యల్ని ఖండిస్తున్నాం. వారు ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం విచారకరం. ఇలాంటి ఘటనలపై ఆతిథ్య ప్రభుత్వం మేం కోరుకుంటున్నట్టు కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపింది.