News March 19, 2024

కాకినాడ చరిత్రలో 1983లో అత్యధికం.. ఈ సారి ఛాన్స్ ఉందా.?

image

కాకినాడ పట్టణ నియోజకవర్గానికి 1952- 2019 వరకు మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ముత్తా గోపాలకృష్ణ కాంగ్రెస్‘ఐ’ అభ్యర్థి మల్లాడిస్వామిపై అత్యధికంగా 55631 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాకినాడ సిటీ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. మళ్లీ అంత మెజారిటీ ఎప్పుడూ రాలేదు. మరి ఈ ఎన్నికల్లో ఇక్కడ గెలుపు ఎవరిదైనా.. ఆ నాటి మెజారిటీని కొల్లగొట్టేనా..?

Similar News

News July 3, 2024

శతాధిక గిరిజనుడిని ఎత్తుకున్న అల్లూరి కలెక్టర్ దినేష్

image

అల్లూరి కలెక్టర్‌‌గా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్ మంగళవారం జిల్లాలోని పలు లోతట్టు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో పెదబయలు అనే గ్రామం వద్ద ప్రజా సమస్యలు చెప్పేందుకు వచ్చిన బాలంనాయుడుకు 100 ఏళ్ల వయసు అని, అతను మాజీ ఎంపీపీ అని తెలిసి సంతోషపడ్డారు. అతనిని ఎత్తుకొని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ప్రజా సమస్యల పట్ల నాయుడు శ్రద్ధను కలెక్టర్ మెచ్చుకొని అభినందించారు.

News July 3, 2024

తూర్పుగోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు పంపిణీ పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో 99.05% పెన్షన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయడం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ విషయాన్ని ఆమె మంగళవారం రాత్రి మీడియాకు తెలియజేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా 2,41,771 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా 2,39,479 మందికి పెన్షన్లను అందించామని స్పష్టం చేశారు.

News July 3, 2024

మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు

image

మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చునని ఏపీఈపీడీసీఎల్ రాజమండ్రి ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షణ ఇంజినీర్ టీవీఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాష్ట్ర తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు ఈ వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఇకపై ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఛాన్స్ లేదన్నారు.