News August 26, 2024
కాకినాడ: చికిత్స పొందుతూ ముగ్గురు మృతి

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వేరు వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం మృతి చెందారు. తుని మండలం ఎస్.అన్నవరానికి చెందిన దొరబాబు (40), పెదపూడి మండలం కాండ్రేగులకు చెందిన శ్రీనివాస్ (47), సామర్లకోట మండలం అచ్చంపేటకు చెందిన త్రిమూర్తులు (38) ముగ్గురు వివిధ కారణాలతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందారని పోలీసులు తెలిపారు.
Similar News
News August 23, 2025
గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ

వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలు, పందిళ్ల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు పొందాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్పష్టం చేశారు. అయితే, ఈ అనుమతుల కోసం ఎటువంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నిబంధనలను ఆయన శుక్రవారం ప్రకటించారు. విగ్రహాల వద్ద తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
News August 23, 2025
ధవళేశ్వరం బ్యారేజీని పరిశీలించిన ఐజీ

గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శుక్రవారం దవళేశ్వరం కాటన్ బ్యారేజీని సందర్శించారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్‌తో కలిసి వరద పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నందున బ్యారేజీ వద్ద సందర్శకులను నియంత్రించాలని, పోలీసు భద్రతను పెంచాలని అధికారులను ఐజీ ఆదేశించారు. సీఐ టి. గణేశ్ ఉన్నారు.
News August 23, 2025
కాకినాడ: స్వర్ణాంధ్రాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి ‘పరిశుభ్రత’తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.