News February 12, 2025

కాకినాడ: జగన్ స్కాములపై విచారణ తప్పనిసరి

image

గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై సీబీఐ, ఈడి సంస్థలతో విచారణ చేయించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాడేపల్లి కేంద్రంగా జరిగిన స్కాముల వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టపోయిందని పేర్కొన్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ ఇందులో ప్రధానమైందని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం జగన్ పై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలన్నారు.

Similar News

News February 12, 2025

హోంగార్డులకు జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు: హరీశ్

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 16వేల మందికి పైగా ఉన్న హోంగార్డులకు నెల పూర్తయి 12 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు విమర్శించారు. చిన్న జీతాలపైనే ఆధారపడి జీవిస్తున్నారని, సమయానికి శాలరీలు రాకపోవడంతో అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా ఇదే తీరు కొనసాగుతోందని దుయ్యబట్టారు. వెంటనే వారికి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

News February 12, 2025

మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

image

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.

News February 12, 2025

మంచిర్యాల: ఉరేసుకొని వివాహిత మృతి

image

మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్‌తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.

error: Content is protected !!