News April 15, 2025
కాకినాడ: జిల్లాకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ

మారిన వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. తుని, పెద్దాపురం, సామర్లకోట, కాకినాడ రూరల్ తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు, ప్రయాణికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలకు పంపించిన చరవాణి హెచ్చరికల్లో పేర్కొంది.
Similar News
News April 17, 2025
ఒక్క సిక్సూ కొట్టలేదు.. కాటేరమ్మ కొడుకులకు ఏమైంది?

IPL: ముంబైతో మ్యాచులో SRH బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడుస్తున్నారు. 14 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 95 పరుగులు మాత్రమే చేశారు. గ్రౌండ్ చిన్నదైనప్పటికీ ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. విధ్వంసానికి మారుపేరైన కాటేరమ్మ కొడుకులు సిక్సర్ బాదేందుకు కష్టపడుతున్నారు. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరి మ్యాచ్ ముగిసేలోపు సిక్సర్ల ఖాతా తెరుస్తారా? లేదా? చూడాలి.
News April 17, 2025
NZB: జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్

జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం జిల్లా కోర్టు భవన సముదాయ ఛాంబర్‌లో జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ఆమెకు పూల బొకేతో జ్ఞాపికను బహూకరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రస్తావిస్తూ అభినందనలు తెలిపారు.
News April 17, 2025
నాగర్‌కర్నూల్: ‘భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలి’

భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ పేర్కొన్నారు. భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో ఇది చారిత్రక మార్పు అని అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం అమలు పై వంగూరు మండలం కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో తెలంగాణ భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు.