News March 12, 2025
కాకినాడ జిల్లాకు ప్రత్యేక అధికారి

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్ ఐఎఎస్ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారిగా వీరపాండియన్‌ను కాకినాడ జిల్లాకు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 6, 2025
భారత్ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

క్వీన్స్‌లాండ్‌లో జరుగుతున్న నాలుగో T20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
IND: అభిషేక్, గిల్, సూర్య (C), తిలక్, అక్షర్, సుందర్, జితేశ్ శర్మ, దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఫిలిప్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షియస్, బార్ట్‌లెట్, ఇల్లిస్, జంపా.
News November 6, 2025
మరిపెడ: ACBకి చిక్కిన AEO

మరిపెడ మండల కేంద్రంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిలికుర్తి గ్రామానికి చెందిన రైతు నుంచి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) గాడిపెల్లి సందీప్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News November 6, 2025
DANGER: CT స్కాన్ చేయిస్తున్నారా?

ఏదైనా చిన్న సమస్యతో ఆస్పత్రికి వెళ్తే సీటీ స్కాన్, MRIలను వైద్యులు సజెస్ట్ చేస్తుంటారు. అయితే CT స్కాన్‌ల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో వచ్చే మొత్తం క్యాన్సర్ సంఖ్యల్లో CT స్కాన్ క్యాన్సర్లు 5 శాతానికి చేరొచ్చని అమెరికాలో జరిగిన అధ్యయనంలో తెలిసినట్లు పేర్కొన్నారు. CT స్కాన్‌ల వినియోగం, డోసులు తగ్గించకపోతే ప్రమాదమేనంటున్నారు.


