News April 10, 2025
కాకినాడ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరిక

కాకినాడ జిల్లాలో గురువారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రెండు రోజుల నుంచి వాతావరణంలో ఏర్పడిన మార్పులు రైతులను కలవర పాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రతికూల వాతావరణంతో రైతుల్లో గుబులు మొదలైంది.
Similar News
News April 18, 2025
సినిమాలు వదిలేస్తున్నట్లు ప్రచారం.. డైరెక్టర్ బూతు పురాణం!

తాను సినిమాలు తీయడం మానేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఖండించారు. ‘నేను ఫిల్మ్ మేకింగ్‌ను వదిలేయట్లేదు. షారుఖ్ ఖాన్ కంటే బిజీగా ఉన్నా. 2028 వరకు డేట్స్ ఖాళీ లేవు. 5 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నా. త్వరలోనే రిలీజ్ అవుతాయి. నేను నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయానని అనుకునే వాళ్లందరూ మీది మీరు..’ అంటూ అసభ్య పదజాలంతో <
News April 18, 2025
సంగారెడ్డి: భర్త ఆత్మహత్య

భార్యలు తన దగ్గర లేరని భర్త గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. అస్సాంకు చెందిన బిశాల్(30) కొల్లూరులో కార్ వాష్ సెంటర్లో పనిచేస్తున్నాడు. మొదటి భార్యతో బిశాల్ తరుచూ గొడవపడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తరువాత నందిగామకు చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారు తరుచూ గొడవపడటంతో ఆమె కూడా వెళ్లింది. మనస్థాపం చెందిన బిశాల్ కారు వాష్ సెంటర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు.
News April 18, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం పంచమి తిధి శుక్రవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.