News April 12, 2025

కాకినాడ జిల్లాకు 20వ స్థానం

image

ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 17,326 మంది పరీక్షలు రాయగా 13,582 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో కాకినాడ జిల్లా రాష్ట్రంలో 20వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్‌లో 20,398 మందికి 12,920 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 15వ స్థానంలో కాకినాడ జిల్లా నిలిచింది.

Similar News

News October 29, 2025

అంగన్‌వాడీల్లో 14వేల పోస్టులు.. మంత్రి కీలక ఆదేశాలు

image

TG: అంగన్‌వాడీల్లో 14K పోస్టుల నియామకానికి చర్యలు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఏజెన్సీలో STలకు 100% కోటాపై సుప్రీంకోర్టు స్టే ఎత్తివేతకు వెకేట్ పిటిషన్ వేయాలన్నారు. KA, AP, ఛత్తీస్‌గఢ్‌లో అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వ సర్వీస్‌గా పరిగణించకపోవడంతో 50% రిజర్వేషన్ రూల్ వర్తించట్లేదని అధికారులు మంత్రికి వివరించారు. దీంతో ఇక్కడా అదే విధానాన్ని అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

News October 29, 2025

కావలిలో భారీ వర్షపాతం నమోదు

image

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు తెలియజేశారు. కావలి 21.2 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దగదర్తిలో 17.7, ఉలవపాడులో 16.2, జలదంకిలో 16.1, కందుకూరులో 15.3, కొడవలూరులో 14.6, కలిగిరిలో 13.8, లింగసముద్రంలో 13.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది.

News October 29, 2025

కాగజ్‌నగర్: ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట మోసం.. వ్యక్తి అరెస్ట్

image

స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరిట ప్రజలను మోసం చేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదోద్దీన్ మంగళవారం తెలిపారు. నిందితుడు స్టాక్స్, ఐపీఓ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసి 108 మందిని అందులో చేర్చి పెట్టుబడుదారులను మోసం చేసినట్లు తెలిపారు. అందులో 26 ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.76,50,000 ఇన్వెస్ట్ చేశాడని పేర్కొన్నారు.