News April 4, 2025
కాకినాడ జిల్లాలో పిడుగుపాటు హెచ్చరికలు జారీ

వాతావరణ పరిస్థితుల ప్రభావంతో కాకినాడ జిల్లాలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. శుక్రవారం ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పెదపూడి తదితర ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ సందేశంలో పేర్కొంది.
Similar News
News April 12, 2025
సత్తా చాటిన అమ్మాయిలు

AP: ఇంటర్ ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు సత్తా చాటారు. రెగ్యులర్ ఫస్టియర్‌లో 66 శాతం మంది బాలురు ఉత్తీర్ణులైతే బాలికలు 75 శాతంతో పైచేయి సాధించారు. సెకండియర్‌లో అబ్బాయిలు 80 శాతం, అమ్మాయిలు 86 శాతం మంది పాసయ్యారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో బాలురు 50 శాతం, బాలికలు 71 శాతం, సెకండియర్‌లో అబ్బాయిలు 67 శాతం, అమ్మాయిలు 84 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
News April 12, 2025
గుంటూరు: హత్య కేసులో నిందితుల అరెస్ట్

పాత గుంటూరులో ఏప్రిల్ 1న జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న ఫైరోజ్, ఫయాజ్‌లు అరెస్టైయ్యారు. షేక్ అర్షద్ బాలికను వేధిస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక సోదరులు ఫైరోజH, ఫయాజ్‌లు స్నేహితులతో కలిసి అర్షద్‌ను తీవ్రంగా కొట్టారు. దీంతో అర్షద్ కుటుంబ సభ్యులు బాలిక కుటుంబంపై దాడి చేశారు. ప్రతిగా ఫైరోజ్, ఫయాజ్‌లు అర్షద్ కుటుంబంపై దాడి చేయడంతో అర్షద్ అమ్మమ్మ చనిపోయింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
News April 12, 2025
గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపీడీఓ మృతి

ఎంపీడీఓగా విధులు నిర్వర్తిస్తున్న మహబూబ్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. పదిహేనేళ్లుగా జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించి ఇటీవల ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. మేలో పదవీ విరమణ ఉండగా ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు.