News March 7, 2025

కాకినాడ జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

image

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. కాకినాడ జిల్లా వాసులు తూ.గో, కోనసీమ జిల్లాకు వెళ్తుంటారు. ఉమ్మడి జిల్లాలలోని విద్యాసంస్థల్లో చదివేవారు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా కాకినాడ జిల్లా దాటి పక్క జిల్లాలకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.

Similar News

News July 4, 2025

టెన్త్ విద్యార్థులకు బహుమతిగా సైకిళ్లు: బండి సంజయ్

image

TG: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ప్రధాని మోదీ 20వేల సైకిళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈనెల 11న తన బర్త్‌డే సందర్భంగా 8, 9 తేదీల్లో వీటిని పంపిణీ చేస్తామన్నారు. KNR, SRCL, JGL, SDPT, HNK జిల్లాల్లోని విద్యార్థులకు వీటిని అందజేస్తామని తెలిపారు. ఒక్కో సైకిల్ ఖరీదు రూ.4వేలు అని, వాటిపై PM ఫొటో ఉంటుందని పేర్కొన్నారు.

News July 4, 2025

నిర్మల్: మైసంపేట్ పునరావాసంపై కలెక్టర్ దృష్టి

image

అటవీ చట్టాలను పాటిస్తూ గ్రామాలకు రహదారి, విద్యుత్, ఆరోగ్య సేవలు కల్పించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా అటవీ కమిటీ సమావేశంలో ‘పరివేశ్’ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని ఆమె సూచించారు. కడెం మండలంలోని మైసంపేట్‌ను పునరావాస గ్రామంగా అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి మనీ ప్యాకేజ్, అటవీ హక్కుల చట్టం కింద సాగు భూములకు పట్టాలు అందించే ప్రక్రియను ప్రారంభించామని పేర్కొన్నారు.

News July 4, 2025

అటవీ ప్రాంతాలకు మెరుగైన రవాణా: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లాలోని మారుమూల అటవీ, గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి అటవీ కమిటీ సమావేశంలో 16 రహదారి ప్రాజెక్టులపై చర్చించి, 9 ప్రాజెక్టులకు అటవీ అనుమతులు మంజూరు చేశారు. మిగిలిన 7 ప్రాజెక్టులకు డాక్యుమెంటేషన్ పూర్తి చేయాలని సూచించారు.