News February 12, 2025
కాకినాడ జిల్లా వాసులకు ALERT

కాకినాడ జిల్లా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతి మండలానికి రెండు ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా పశువర్ధక శాఖ ప్రకటించింది. మంగళవారం మొత్తం 42 బృందాలు జిల్లా వ్యాప్తంగా పరిశీలించాయి. 82 ఫారాలలో 62 లక్షల కోళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా కోళ్ల మరణాలు జరిగితే వెంటనే అధికారులు తెలియజేయాలని ఆదేశాలిచ్చింది.
Similar News
News November 5, 2025
గోదావరిఖని: అక్టోబర్ నెలలో షీటీంకు 69 ఫిర్యాదులు

రామగుండం కమిషనరేట్ పరిధిలో అక్టోబర్ నెలలో మొత్తం 69 ఫిర్యాదులు వచ్చాయని సీపీ అంబర్ కిషోర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థినులు షీ టీమ్స్ నంబర్లు 6303923700 (కమిషనరేట్), 8712659386 (పెద్దపల్లి), 8712659386 (మంచిర్యాల)ను సంప్రదించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎల్లప్పుడూ పని చేస్తాయని తెలిపారు.
News November 5, 2025
శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

శ్రీశైలంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన గుడి పరిసరాలు, నంది మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
News November 5, 2025
NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


