News April 11, 2025
కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 18, 2025
ప్రజాస్వామ్య పద్ధతిలో సంస్థాగత ఎన్నికలు: ఎంపీ శ్రీభరత్

T.D.P. సంస్థాగత ఎన్నికల్లో అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీలను ఎన్నుకోవాలని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సూచించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏకాభిప్రాయం కుదరకపోతే జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ రామారావు తదితరులు పాల్గొన్నారు.
News April 18, 2025
ఖమ్మం: ఫైనాన్స్ వేధింపులు.. యువకుడి SUICIDE

ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం(D) బోనకల్(M) గోవిందపురం(ఎల్)లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇసంపల్లి సైదా గత కొద్ది రోజుల క్రితం ఓ కంపెనీలో ఫైనాన్స్ తీసుకోగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఫైనాన్సర్ వేధింపులు ఎక్కువయ్యాయి.. దీంతో మనస్తాపం చెంది, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని గ్రామస్థులు తెలిపారు. మృతుడి భార్య ఠాణాలో ఫిర్యాదు చేశారు.
News April 18, 2025
ఎస్సీ వర్గీకరణ: రిజర్వేషన్ ఇలా

AP: ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ మార్గదర్శకాలు, నిబంధనలతో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రూప్-1లో రెల్లి సహా 12 ఉపకులాలకు 1%, గ్రూప్-2లో మాదిగ సహా 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్-3లో మాల సహా 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ కల్పించింది. ఉద్యోగాల్లో 200 రోస్టర్ పాయింట్లు అమలు చేయనుంది. 3 కేటగిరీల్లో మహిళలకు 33.3% రిజర్వేషన్లు వర్తిస్తాయి. అర్హులు లేకుండా తదుపరి నోటిఫికేషన్‌కు ఖాళీలను బదలాయిస్తారు.