News February 23, 2025
కాకినాడ జిల్లా TODAY TOP NEWS

➤తునిలో వైసీపీ కౌన్సిల్ సభ్యులు రాజీనామా?
➤పెద్దాపురంలో బంగారం, వెండి చోరీ
➤కాకినాడ: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-2 పరీక్షలు
➤దుబాయిలో మంత్రితో సానా సతీష్
➤కుంభమేళాలో జగ్గంపేట ఎమ్మెల్యే కుటుంబం
➤తునిలో ఫ్రీ చికెన్.. ఎగబడ్డ ప్రజలు
➤గండేపల్లి: గ్రూప్-2 పరీక్షకు 1590 మంది గైర్హాజరు
➤పెదపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
➤కిర్లంపూడి: ముద్రగడను కలిసిన దాడిశెట్టి రాజా
Similar News
News December 25, 2025
బంగ్లాదేశ్‌లో హిందువుల ఇళ్లకు నిప్పు..

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గడిచిన 5 రోజుల్లో 7 హిందూ కుటుంబాలపై <<18670618>>నిరసనకారులు<<>> దాడి చేసినట్టు తెలుస్తోంది. 2 ఇళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టిన ఘటనలో 8 మంది త్రుటిలో తప్పించుకున్నారు. ఈ దాడి చేసినట్టు అనుమానిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం కూడా హిందువుల ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు.
News December 25, 2025
అనంత: స్నేహితుల మధ్య గొడవ.. కత్తితో దాడి

అనంతపురంలోని కమల నగర్‌కు చెందిన స్నేహితులు జనార్దన్, సుధాకర్ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇద్దరూ కలిసి వాళ్ల మిత్రుడు ఇంటికి భోజనానికి వెళ్లారు. వారిద్దరి మధ్య మాట-మాట పెరగడంతో జనార్దన్ తన స్నేహితుడు సుధాకర్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుధాకర్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 25, 2025
క్రీస్తు లోక రక్షకుడు: చిత్తూరు కలెక్టర్

చిత్తూరులోని లక్ష్మీనగర్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీట్టీ మెమోరియల్ చర్చ్‌లో రేవ శామ్వేల్ ఆర్థర్ అధ్యక్షతన ప్రార్థనలు చేశారు. ఈ వేడుకలకు కలెక్టర్ సుమిత్ కుమార్ కుటుంబ సభ్యులతో కలసి హాజరయ్యారు. లోక రక్షకుడైన క్రీస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. క్రీస్తు లోక రక్షకుడని, ఆయన జననం లోకానికి సమాధానమని తెలిపారు.


