News March 23, 2025
కాకినాడ జీజీహెచ్‌ను వదలని జీబీఎస్ కేసులు

కాకినాడ ప్రభుత్వాసుపత్రిని జీబీఎస్ కేసులు వదలడం లేదు. ఇప్పటివరకు 9మందికి పైగా గిలియన్ బారే సిండ్రోమ్ బాధితులు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. శనివారం ఇద్దరు పేషెంట్లు కొత్తగా చేరారు. ప్రస్తుతం ఐదుగురు పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్యకుమారి తెలిపారు. జ్వరం, శ్వాసకోశ సమస్యలు బలహీనత తదితర అంశాలతో బాధపడేవారు జీజీహెచ్‌కు రావాలని ఆమె సూచించారు.
Similar News
News March 24, 2025
KTDM: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ పెంపు

రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల వ్యాలిడిటీ ఈనెల 31కి పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో మూడు నెలలు జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాలపరిమితిని పెంచింది. దీంతో జూన్ చివరిదాకా అక్రిడేషన్ కార్డులు చెల్లుబాటు కానున్నాయి. అక్రిడేషన్ కార్డులను ఆయా జిల్లాల డీపీఆర్ఓల వద్ద మూడు నెలలు పొడగింపుకు సంబంధించిన స్టిక్కర్‌తో బస్సు పాసులను రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
News March 24, 2025
MTM: పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి – కలెక్టర్

మీకోసం కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇప్పటి వరకు 19,839 అర్జీలు అందగా అందులో ఇంకా 2,235 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించాలన్నారు.
News March 24, 2025
పార్లమెంటులో ‘ఛావా’ చూడనున్న మోదీ, కేంద్ర మంత్రులు!

ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం ‘ఛావా’. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సూపర్ డూపర్ హిట్ సినిమాను త్వరలో పార్లమెంటులో ప్రదర్శిస్తారని తెలిసింది. ఈ స్క్రీనింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారని సమాచారం. నటుడు విక్కీ కౌశల్, క్యాస్ట్ అండ్ క్రూ వస్తారని తెలుస్తోంది. స్క్రీనింగ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.