News February 21, 2026
కాకినాడ: టెన్త్ అర్హతతో 150 ఖాళీలకు జాజ్ మేళా

కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24న పలు కంపెనీల్లో 150 ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డీమార్ట్, స్మార్ట్ మీటర్లు ఇనిస్టాలేషన్, ఎక్షమో, ఆక్వాఎక్స్ పోర్టు తదితర సంస్థల్లో పని చేసేందుకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 18-32 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులన్నారు. టెన్త్ -డిగ్రీ అభ్యర్థులు నకలులతో ఉదయం 10గం.లకు హాజరు కావాలన్నారు.
Similar News
News February 21, 2026
తూ.గో: నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడి అత్యాచారయత్నం

తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు వృద్ధుడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 21, 2026
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 10 మంది మృతి

లెబనాన్‌లోని హెజ్బొల్లా గ్రూపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో సీనియర్ ఫీల్డ్ కమాండర్ సహా 10 మంది మరణించగా 50 మందికి గాయాలయ్యాయి. ఇరు దేశాల మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించాయి. తమ దేశంపై దాడులకు ప్రణాళికలు వేస్తున్నారనే పక్కా సమాచారంతోనే రివర్స్ అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
News February 21, 2026
టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యం: DEO

పదవ తరగతి పరీక్షల్లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ పిలుపునిచ్చారు. శనివారం పోడూరులోని క్లస్టర్ కాంప్లెక్స్‌లను ఆయన ఆకస్మికంగా సందర్శించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక స్థాయిలో అభ్యసనంలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సూర్యనారాయణ, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


