News February 28, 2025
కాకినాడ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 14 మందికి జైలు శిక్ష పడినట్లు కాకినాడ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 23 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను బుక్ చేసినట్లు పేర్కొన్నారు. వారికి శుక్రవారం కాకినాడ మూడో అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు వెలువరించారు. ఒకరికి ఆరు రోజులు, 13 మందికి 2 రోజులు చొప్పున శిక్ష ఖరారు చేశారు. 9 మందికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90 వేలు జరిమానా విధించారు.
Similar News
News March 1, 2025
మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం.✓నేటితో ముగిసిన కుల గణన సర్వే.✓రాజాపూర్‌లో పోలీసులు రెవెన్యూ సిబ్బంది ఇసుక రీచ్‌లు ధ్వంసం.✓ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు. ✓దేవరకద్రలో రైలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు.✓దేవరకద్ర: వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.✓భూత్పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు.
News March 1, 2025
ఆహారం నాణ్యతపై తనిఖీలు నిర్వహించాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఉన్న వసతిగృహాలలో మంచినీరు, ఆహారం నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ విజయ్ కృష్ణన్ సూచించారు. శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్.ఎస్.ఎమ్.ఇ. సర్వే మార్చి 15నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో అతిసార, మలేరియా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు ప్రబలకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
News March 1, 2025
విశాఖలో TODAY TOP NEWS

➤ KGHలో నకిలీ డాక్టర్.. రూ.లక్షతో పరార్..!
➤ ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా సంధ్యాదేవి
➤ సింహాద్రి, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లు రద్దు
➤ బాధ్యతలు స్వీకరించనున్న AU వీసీ జి.పి రాజుశేఖర్
➤ ప్రత్యేక అలంకరణలో చంద్రంపాలెం దుర్గాలమ్మ
➤ ఆటోనగర్, ఐటీ హిల్స్ ప్రాంతాలకు ప్రత్యేక RTC సర్వీసులు నడపాలి: కలెక్టర్
➤ విశాఖలో చిట్టీల పేరుతో ఘరానా మోసం
➤ జిల్లాలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు రాయనున్న 83,001 మంది