News March 9, 2025

కాకినాడ: తల్లితో స్కూటర్‌పై 92వేల కి.మీ. ప్రయాణం

image

బెంగుళూరుకు చెందిన కృష్ణకుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అతని తండ్రి దక్షిణామూర్తి మృతి చెందడంతో తల్లి ఒంటరితనం చూసి ఉద్యోగం వదిలి మైసూర్ వచ్చేశారు. తీర్థయాత్రలు చేయాలన్న తల్లి కోరికను కొడుకు తీరుస్తున్నాడు. తన తండ్రి కొన్న స్కూటర్‌పై పర్యటనలు ప్రారంభించారు. ఇప్పటివరకు 92 వేల కిలోమీటర్లు ప్రయాణించారు. శనివారం కాకినాడలోని ఆలయాలు సందర్శించారు. తల్లి కోసం చేస్తున్న పనిని చూసి అతడిని పలువురు అభినందించారు.

Similar News

News November 9, 2025

PGIMERలో ఉద్యోగాలు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<>PGIMER<<>>) 5 ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-2 పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 19న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MDS, డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/

News November 9, 2025

ఆదిలాబాద్: రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

image

ఆదిలాబాద్‌లోని ఐపీ స్టేడియంలో సోమవారం అస్మిత అథ్లెటిక్స్ లీగ్ (2025-26) జిల్లాస్థాయి ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజా రెడ్డి తెలిపారు. అండర్ 14, 16 విభాగాల్లో బాలికలకు ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 94921 36510 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News November 9, 2025

జూబ్లీ‘హిట్’ అయ్యేదెవరో?

image

హాట్ సీటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తుది దశకు చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచారానికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. దివంగత MLA మాగంటి గోపీనాథ్ భార్యకే టికెట్ ఇచ్చిన BRS సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న INC నవీన్ యాదవ్‌ గెలుపునకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అటు జూబ్లీహిల్స్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని BJP చెబుతోంది. మీ కామెంట్?