News March 22, 2025
కాకినాడ: తల్లిని చంపిన కొడుకు అరెస్ట్

కాకినాడలోని అచ్యుతాపురంలో ఈనెల 16న తల్లి షేక్ జహారా బీబీని హత్య చేసిన కొడుకు కమల్‌ను ఇంద్రపాలెం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. SI వీరబాబు వివరాలు.. బీటెక్ మధ్యలో ఆపేసి ఇంటి వద్ద రెండేళ్లుగా ఖాళీగా ఉంటున్న కొడుకును ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని తల్లి అనడంతో తల్లిని నుదిటిపై బలంగా కొట్టి చంపాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.
Similar News
News December 26, 2025
డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్

ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి గంజాయి అక్రమంగా సరఫరా కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ నివారణ జాతీయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన, గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేయాలన్నారు. సీక్రెట్ పోలీసుల ద్వారా సమాచారాన్ని సేకరించి, రవాణాకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
News December 26, 2025
వీర్ బాల్ దివస్ వేడుకల్లో కర్నూలు కలెక్టర్ సిరి

బాలలకు సరైన అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘వీర్ బాల్ దివస్–2025’లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీర్ బాల్ పురస్కారం అందుకున్న మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివానిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
News December 26, 2025
రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కార్ అవార్డులు

తెలంగాణ వ్యాప్తంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సంకల్ప యువ పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు, కోహెడ వాసి వలస సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న హైదరాబాద్ రవీంద్రభారతిలో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. 30 ఏళ్ల లోపు యువజన, మహిళా సంఘాలు చేసిన సామాజిక సేవ ఆధారంగా అవార్డులు ఇస్తామన్నారు.


