News April 11, 2025
కాకినాడ: నేడు పిడుగులతో కూడిన వర్షాలు

కాకినాడ జిల్లాలో శుక్రవారం అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాతావరణంలో మార్పులు రైతులను కలవర పెడుతున్నాయి. NOTE: పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద ఉండకండి.
Similar News
News April 18, 2025
జంక్ ఫుడ్ తినకుండా ఉండలేకపోతున్నారా?

కొందరు జంక్ ఫుడ్ కనిపిస్తే చాలు తినేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్య గ్యాప్‌లో పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. అలాగే డెయిరీ పదార్థాలు, గుడ్లు ఎక్కువగా తిన్నా జంక్ ఫుడ్‌పైకి మనసు వెళ్లదు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే జంక్ ఫుడ్ తినాలనే కోరికలు నియంత్రణలో ఉంటాయి.
News April 18, 2025
HYD: చంటి పిల్లలకు తల్లిపాలు మహాబలం..!

చిన్నారి పుట్టిన గంటలోపే తల్లిపాలు అందించాలని HYD తార్నాకలోని NIN అధికారులు పలు సూచనలతో లిస్ట్ విడుదల చేశారు. మొదటి 6 నెలలు తల్లిపాలు మాత్రమే అందించడంతో శిశువుకు కావలసిన పోషకాలు అందుతాయని తద్వారా పిల్లలు బలంగా ఉంటారని NIN తెలిపింది. తల్లిపాలతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఎత్తుకు తగ్గ బరువు ఉంటారని పేర్కొంది. పోషణ్ పక్వాడ-2025 కింద ఈ విషయాలు వెల్లడించింది.
News April 18, 2025
మాజీ ఎంపీ సోయం బాపురావుకు చేదు అనుభవం

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క పర్యటనలో మాజీ ఎంపీ సోయం బాపురావుకు చేదు అనుభవం ఎదురైంది. హెలికాప్టర్‌లో శుక్రవారం జిల్లాకేంద్రానికి చేరుకున్న మంత్రులకు స్వాగతం పలికేందుకు ఐపీ స్టేడియానికి వచ్చిన మాజీ ఎంపీని హెలిప్యాడ్ వద్ద పోలీసులు అనుమతించలేదు. నేతల జాబితాలో సోయం పేరు లేదని పోలీసులు అడ్డుకోవడంతో 10 నిమిషాల పాటు సోయం అక్కడే ఉండిపోయారు.