News December 17, 2025

కాకినాడ: పథకాల అమలుకు ఈ గణాంకాలే ప్రామాణికం

image

జిల్లాలో ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే-2025’ కొనసాగుతోంది. ఈ నెల 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో సచివాలయ సిబ్బంది ఆర్థిక, సామాజిక వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయడంతో పాటు విద్య, ఉపాధి, ఆస్తుల మ్యాపింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. వచ్చే నెల 12 నాటికి సర్వేను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు ఈ గణాంకాలే ప్రామాణికం కానున్నాయి.

Similar News

News December 20, 2025

నల్గొండ: ఏ ఎన్నికలు ముందు జరుగుతాయి?

image

జీపీ ఎన్నికల అనంతరం గ్రామాల్లో నూతన చర్చ జరుగుతోంది. సహకార, మార్కెటింగ్ సంస్థలకు పాలకవర్గాలను రద్దు చేయడంతో ఏ ఎన్నికలు ముందు జరుగుతాయనే చర్చ మొదలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, సహకార సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాల్సి ఉంది. దీంతో ముందు మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పష్టత రాలేదు.

News December 20, 2025

రేపు HYDలో KCR అధ్యక్షతన సమావేశం

image

రేపు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో KCR అధ్యక్షతన BRS ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. మ.2 గం.కు సమావేశం ప్రారంభం కానుంది. ఏపీ జల దోపిడీలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ మాట్లాడనున్నట్లు సమాచారం. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై దిశానిర్దేశం చేయనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 TMCలకే ఒప్పుకోవడంపై ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.

News December 20, 2025

చౌటుప్పల్: ఉత్తర ద్వార దర్శనానికి ఆది మహావిష్ణు దేవాలయం సిద్ధం

image

వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి దేవలమ్మ నాగారంలోని ఆది మహా విష్ణు దేవాలయంలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ ఛైర్మన్ వరకాంతం జంగారెడ్డి తెలిపారు. ఈనెల 29 నుంచి 31 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనం కల్పిస్తామని, తాగునీరు, క్యూలైన్లు, స్వచ్ఛంద సేవకుల వంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.