News March 11, 2025

కాకినాడ పర్యటనకు విచ్చేసిన మాజీ జస్టిస్ ఎన్.వీ రమణ

image

భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ.రమణ కాకినాడ జిల్లా పర్యటన నిమిత్తం సోమవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ జీ.బిందు మాధవ్, జిల్లా నాల్గవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నిరుపమ పుష్పగుచ్ఛాలు అందించి ఆయనకు సాదర స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం 9.గంటలకు ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని అధికారులు తెలిపారు. 

Similar News

News February 25, 2026

గుంతకల్లు డివిజన్‌లో ఖాళీల భర్తీకి కసరత్తు

image

సౌత్ సెంట్రల్ రైల్వే గుంతకల్లు డివిజన్‌లో పాయింట్స్ మెన్ ఖాళీల భర్తీ కోసం 16 మంది మాజీ సైనికులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎంపికైన వారికి రూ.18,000 వేతనం, ఇతర భత్యాలు చెల్లిస్తామని చెప్పారు. మాజీ సైనికులు మార్చి 6వ తేదీ లోపు దరఖాస్తులను గుంతకల్లు డివిజన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 08554 241146 సంప్రదించాలని కోరారు.

News February 25, 2026

VKB: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. వికారాబాద్‌లో 28 పరీక్షా కేంద్రాల్లో 8,384 మంది 1st ఇయర్, 8,006 మంది 2nd ఇయర్ విద్యార్థులు రాయనున్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు తదితరాలు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
ALL THE BEST

News February 25, 2026

రేపే నెల్లూరుకు జగన్.. టైమింగ్స్ ఇవే!

image

మాజీ సీఎం జగన్ నెల్లూరులో గురువారం పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి నెల్లూరు రూరల్ కనుపర్తిపాడు జడ్పీ హైస్కూల్లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా గొలగమూడి రోడ్డులోని VPR కన్వెన్షన్ హాలుకు వస్తారు. అక్కడ వివాహ వేడుకల్లో పాల్గొని 10.45 గంటలకు బెంగళూరు వెళ్తారు.