News March 3, 2025

కాకినాడ: పార్సిల్ కార్యాలయాలపై పోలీసు దాడులు

image

కాకినాడలోని బాలాజీ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని పార్సిల్ కార్యాలయాలలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయం వెల్లడించింది. అనుమానిత పార్సిల్ ఉంటే తమకు తెలియజేయాలని పోలీసులు సూచించారు.

Similar News

News February 15, 2026

చిత్తూరు జిల్లా ప్రజలకు గమనిక

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100 కాల్ చేసి చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News February 15, 2026

బ్లాక్ సర్కిల్స్‌కి ఇంటి చిట్కాలు

image

కంప్యూటర్లపై ఎక్కువ పనిచేయడం, వేళకు నిద్రలేకపోవడం, ఫోన్ ఎక్కువగా చూడటం వల్ల కొందరికి కళ్ల కింద నల్లటి చారలు వచ్చేస్తాయి. వీటిని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. * బంగాళదుంపరసం తీసుకుని కళ్ల అడుగున రాసి 15ని తరువాత కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం ఉంటుంది. * బాదంనూనెలో ఉండే విటమిన్ K నల్లటి వలయాలను తగ్గిస్తుంది. నిద్రపోయే ముందు ఈ నూనెను కళ్ల చుట్టూ రాసుకుని మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.

News February 15, 2026

మెరుగైన ర్యాంకు కోసం GVMC కసరత్తు

image

స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26 సర్వే నేపథ్యంలో నగర ర్యాంకు మెరుగుదలపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే నెల ఢిల్లీ బృందం పరిశీలనకు రానుంది. దీంతో జీవీఎంసీ పర్యవేక్షణను పెంచి సిబ్బంది పనితీరును సమీక్షిస్తోంది. పారిశుద్ధ్య లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అవగాహన కార్యక్రమాలతో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, మెరుగైన ర్యాంకే లక్ష్యంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.