News April 19, 2024
కాకినాడ: పిఠాపురం మీదుగా CM జగన్ యాత్ర

సీఎం జగన్ బస్సుయాత్ర శుక్రవారం ఉదయం 9గంటలకు ఎస్టీ రాజపురం నుంచి బయలుదేరుతుంది. రంగంపేట మీదుగా పెద్దాపురం నియోజకవర్గంలో ప్రవేశించి, పెద్దాపురం-సామర్లకోట బైపాస్ మీదుగా ఉండూరు క్రాస్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అక్కడినుంచి సాయంత్రం 3:30గంటలకు అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత పిఠాపురం, గొల్లప్రోలు మీదుగా గొడిచర్లక్రాస్ వద్ద రాత్రికి బస చేస్తారు.
Similar News
News October 9, 2025
తూ.గో జిల్లా అడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు

ఏపీ ఎన్జీవో సంఘం తూర్పుగోదావరి జిల్లాఅడహాక్ కమిటీ ఛైర్మన్‌గా మీసాల మాధవరావు ఎన్నికయ్యారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి రోటరీ హాల్లో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా సమావేశంలోఅడహాక్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. కో ఛైర్మన్ ప్రవీణ్ కుమార్, కన్వీనర్‌గా అనిల్ కుమార్, ఆర్థిక సభ్యుడిగా సత్యనారాయణ రాజు, సభ్యులుగా వెంకటేశ్వరరావు, నందీశ్వరుడు, ఎస్ వెంకటరమణ ఎన్నికయ్యారు.
News October 9, 2025
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు చేపట్టాం: కలెక్టర్

తూ.గో జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు. బుధవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు కలెక్టరేట్‌లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో సుమారు 176 హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామన్నారు.
News October 8, 2025
బాణసంచా తయారీకి అనుమతులు తప్పనిసరి: జేసీ

జిల్లాలో బాణసంచా తయారీదారులు, విక్రయదారులు రెవెన్యూ అధికారుల వద్ద అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ అన్నారు. బుధవారం జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..బాణసంచా తయారీ కేంద్రాలను రెవెన్యూ, ఫైర్, పోలీస్ అధికారులు బాణాసంచా తయారు కేంద్రాలపై తనిఖీలు చేపట్టాలన్నారు.