News November 25, 2025
కాకినాడ: ‘పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి’

ఎస్పీ బిందు మాధవ్ సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్‌ఓలను ఆదేశించారు. ఈ సమీక్షలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఎస్డీపీఓ మనీశ్ పాటిల్, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీహరి రాజు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
హీరోల రెమ్యునరేషన్ తగ్గిస్తే టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతాయ్?

సినిమా టికెట్ రేట్ల పెరుగుదలకు టాప్ హీరోల రెమ్యునరేషనే ప్రధాన కారణమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అగ్ర హీరోలు ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు తీసుకుంటున్నారు. దీనివల్లే బడ్జెట్ పెరుగుతోందని, పెట్టిన డబ్బులు రాబట్టేందుకు నిర్మాతలు ప్రేక్షకులపై టికెట్ల భారం మోపుతున్నారని చెబుతున్నారు. అలాగే థియేటర్లలో స్నాక్స్ రేట్లను కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News November 25, 2025
NZB: మూడు విడతల్లో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు

నిజామాబాద్ జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 545 GPలు, 5,022 వార్డులకు ఎన్నికలు జరగనుండగా మొదటి విడతలో బోధన్ డివిజన్లోని 11 మండలాల్లో 184 GPలు, 1,642 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో NZB డివిజన్‌లోని 196 GPలు, 1,760 వార్డులకు, మూడో విడతలో ఆర్మూర్ డివిజన్‌లోని 12 మండలాల్లో 165 GPలు, 1,620 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మెదక్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని సూచించారు. డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.


