News November 25, 2025

కాకినాడ: ‘పెండింగ్ కేసులపై దృష్టి సారించాలి’

image

ఎస్పీ బిందు మాధవ్ సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ నిర్వహించారు. స్టేషన్ల వారీగా కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి దృష్టి సారించాలని ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్‌ఓలను ఆదేశించారు. ఈ సమీక్షలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఎస్డీపీఓ మనీశ్ పాటిల్, డీఎస్పీలు సత్యనారాయణ, శ్రీహరి రాజు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

కామారెడ్డి జిల్లాలో కలెక్టర్, ఎస్పీ సంయుక్త సమీక్ష

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశిష్ సాంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో మంగళవారం కీలక విభాగాలపై సమీక్ష సమావేశం జరిగింది. పౌర హక్కుల రక్షణ చట్టం-1955, SC/ST అట్రాసిటీ చట్టాల అమలు, పెండింగ్ కేసుల పురోగతిపై అధికారులు వివరాలు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేకంగా చర్చ జరగగా, అవగాహన కార్యక్రమాలు, సంయుక్త దళాల తనిఖీలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

News November 25, 2025

భారత రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవాలి: కలెక్టర్

image

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు ఉదయం 11:30 గంటలకు అన్ని కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. సంవిధాన దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖలో తగిన గౌరవంతో నిర్వహించాలన్నారు. రాజ్యాంగ విలువలపై గౌరవం పెంచేందుకు ముఖ్యమైందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సామూహిక పఠనాన్ని నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.

News November 25, 2025

రంగారెడ్డిలో ఎన్నికలు జరిగే తేదీలు ఇవే..

image

RR గ్రామపంచాయతీ పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్‌లో షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌‌, శంషాబాద్‌ (M)లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్‌లో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్‌లో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.