News February 28, 2026

కాకినాడ పేలుడు ఘటనపై PM దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన

image

AP: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనపై పీఎం మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో ప్రాణనష్టం సంభవించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 21 మంది చనిపోయారు.

Similar News

News February 28, 2026

అమెరికాVsఇరాన్.. ఎవరి బలం ఎంత?

image

☛ డిఫెన్స్ బడ్జెట్: USA $895B, ఇరాన్ $15.4B
☛ యాక్టివ్ మిలిటరీ సిబ్బంది: USA 13.28L, ఇరాన్ 6.10L
☛ రిజర్వ్ మిలిటరీ: USA 7.99L, Iran 3.5L
☛ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైటర్స్: USA 1,790, Iran:188
☛ న్యూక్లియర్ వార్ హెడ్స్: USA: 5,244, Iran: 0
☛ అటాక్ హెలికాప్టర్లు: USA: 1,002, Iran: 13
☛ ట్యాంక్స్: USA: 4,640, Iran: 1,713
☛ సబ్‌మెరైన్స్: USA: 70, Iran: 25

News February 28, 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. సంయమనం పాటించాలన్న భారత్

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోరింది. US, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గించి, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలంది. మరోవైపు మిడిల్ ఈస్ట్‌ దేశాల్లో ఉద్రిక్తత వేళ DGCA కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా దేశాలకు విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపేయాలని పేర్కొంది. కాగా Air India ఇప్పటికే తన సర్వీసులను రద్దు చేసింది.

News February 28, 2026

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి: CM రేవంత్

image

TG: కోకాపేటలోని భూమిని శారదా పీఠానికే కొనసాగించాలని CM రేవంత్ నిర్ణయించారు. పీఠం భూములను జలమండలికి కేటాయించడంతో వివాదం మొదలైంది. ఇవాళ హరీశ్ రావు సైతం అక్కడికి వెళ్లి మద్దతు తెలిపారు. అయితే కేటాయింపు భూముల్లో సాగుతున్న నిర్మాణ పనుల విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదని అధికారులపై CM ఆగ్రహం వ్యక్తం చేశారు. జలమండలికి భూముల కేటాయింపు రద్దు చేసి, శారదా పీఠానికే కొనసాగించాలని ఆదేశించారు.