News October 28, 2025

కాకినాడ పోర్టుకు 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

మొంథా తుఫాను ప్రభావంతో కాకినాడ పోర్ట్‌లో 7వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను తగ్గించారు. గాలులకు తెగిపడే అవకాశం ఉన్నందున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాసంస్థలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తప్పనిసరిగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని అధికారులు సూచిస్తున్నారు.

Similar News

News October 28, 2025

ఇసుక రవాణా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలి- కలెక్టర్

image

జిల్లాలో ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో స్థానిక అవసరాల మేరకు ఇసుక వినియోగం పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News October 28, 2025

సీఎంఆర్ సరఫరా వేగవంతం చేయాలి: ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్‌(CMR) సరఫరా ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాజార్షి షా అధికారులు, రైస్ మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరా పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సన్నబియ్యం మిల్లింగ్, సరఫరా పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు.

News October 28, 2025

జిల్లాలో మరిన్ని పునరావాస కేంద్రాలు: కలెక్టర్

image

మొంథా తుఫాను నేపథ్యంలో జిల్లాలో ఇప్పటివరకు 29 పునరావస కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం 19 పునరావాస కేంద్రాలను నిర్వహించడం జరుగుతుందని భారీ వర్షాల కారణంగా ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయవలసి వస్తే అధికారులు అందుకు తగిన విధంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.