News September 23, 2025
కాకినాడ: ప్రభుత్వ ఆసుపత్రిలో 2డి ఎకో సేవలు పునః ప్రారంభం

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో 2డి ఎకో గుండె వైద్య పరీక్షలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి. కొంత కాలంగా నిలిచిపోయిన కార్డియాలజీ సేవలను తిరిగి ప్రారంభించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి కృషి చేశారు. ఇన్ సోర్సింగ్ విధానంలో ఈ పరీక్షలు జరుగుతున్నాయని, ఒకే రోజు 30 మందికి 2డి ఎకో పరీక్షలు నిర్వహించామని ఎన్టీఆర్ వైద్య సేవల సమన్వయ అధికారి డాక్టర్ వర ప్రసాద్ తెలిపారు.
Similar News
News September 23, 2025
గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య అంశాలపై మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
News September 23, 2025
ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.
News September 23, 2025
MBNR:PU.. సౌత్ జోన్ కబడ్డీ మహిళల జట్టు ఇదే..!

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ కబడ్డీ మహిళల జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ VC జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి పాలమూరు విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మహిళా కబడ్డీ జట్టు:
1. పద్మ, 2.రాజేశ్వరి, 3.అనిత, 4.అనూష, 5.సరిత, 6.పార్వతి, 7.శిరీష, 8.కావేరి,9. సునేమా, 10.పూజ, 11.సునీత,12.కవిత,13.హిందూ,14. శ్రావణి,15.వాసంతి, 16.శ్రావణి