News March 22, 2026
కాకినాడ: బయటకు వెళ్తున్నారా? పులి పొంచి ఉంది జాగ్రత్త!

వేములోవ, పిడతామామిడి పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు ఆదివారం ధ్రువీకరించారు. రాత్రి వేళల్లో పులి జాడలు కనిపించడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పిల్లలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటవీ శాఖ సిబ్బంది నిరంతరం నిఘా ఉంచుతూ గ్రామాల్లో అప్రమత్తత చర్యలు చేపడుతున్నారు.
Similar News
News April 14, 2026
మే తొలి వారంలో టెన్త్ ఫలితాలు!

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిన్నటితో ముగిశాయి. మే తొలి వారంలో ఫలితాలు రిలీజ్ చేసేందుకు SSC బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పరీక్షలు కొనసాగుతుండగానే సమాంతరంగా ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ నిర్వహించారు. ఇప్పటికే తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయినట్లు తెలుస్తోంది. సైన్స్, సోషల్ వాల్యుయేషన్, స్కానింగ్ ప్రక్రియ ఈ నెల 25 లోపు పూర్తి కానుందని సమాచారం.
News April 14, 2026
3 నెలలు తట్టుకోగలరా?.. అమెరికాకు ఇరాన్ కౌంటర్

హార్ముజ్ జలసంధిని అమెరికా బ్లాక్ చేయడంపై ఇరాన్ దీటుగా స్పందించింది. తమకు ఇబ్బందేం లేదని, 90 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా సప్లై చేయగలమని పేర్కొంది. ‘ఇరాన్‌ను దిగ్బంధిస్తానని ఆయన(ట్రంప్) బెదిరించాడు. 3 నెలలపాటు అమ్ముకోవడానికి సరిపడా చమురు నిల్వ మా ట్యాంకర్లలో ఉంది. మీరు, మీ మిత్రదేశాలు అన్ని రోజులు తట్టుకోగలరని మీకు నమ్మకముందా?’ అని బల్గేరియాలోని ఇరాన్ ఎంబసీ ప్రశ్నించింది.
News April 14, 2026
IPL: CSKతో మ్యాచ్.. KKR బోణీ కొడుతుందా?

IPLలో భాగంగా ఇవాళ చెన్నై, కోల్‌కతా తలపడనున్నాయి. ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నాయి. ఒక మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, ఆడిన 3 మ్యాచుల్లోనూ KKR ఓడింది. దీంతో ఇవాళ్టి మ్యాచులో గెలవాలని భావిస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించి చెన్నై టచ్‌లోకి వచ్చింది. అదే ఊపుతో విక్టరీ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.


