News March 18, 2025

కాకినాడ: భర్త వేధింపులు.. కుటుంబాన్ని పోషించలేక సూసైడ్

image

కాకినాడలో నిన్న స్వాతి అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడ ఉన్న సూసైడ్ నోట్, సెల్ఫీవీడియో ద్వారా తెలిసింది. స్వాతి(26), సురేష్‌లది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు పిల్లలు. సురేష్ డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసయ్యాడు. స్వాతి తెచ్చిన జీతం తీసుకొని తాగేసి గొడవ పడేవాడు. ఇలా అయితే పిల్లల భవిష్యత్తు ఏంటని ఆందోళన చెంది సూసైడ్ చేసుకుంది.

Similar News

News March 18, 2025

పిటిషనర్‌కు షాకిచ్చిన హైకోర్టు.. రూ.కోటి జరిమానా

image

TG: హైకోర్టును తప్పు దోవ పట్టించాలని చూసిన ఓ వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని దాచి వేరే బెంచ్‌లో ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ సీరియస్ అయ్యారు. హైకోర్టును తప్పు దోవ పట్టించేలా పిటిషన్ వేసినందుకు రూ.కోటి జరిమానా విధించారు. దీంతో అక్రమ మార్గాల్లో ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవాలన్న పిటిషనర్‌కు కోర్టు చెక్ పెట్టింది.

News March 18, 2025

ఎచ్చెర్లలో భార్య హత్య .. లొంగిపోయిన భర్త 

image

ఎచ్చెర్ల మండలం ఎస్ఎస్ఆర్ పురం గ్రామానికి చెందిన గాలి నాగమ్మ (45)ను ఆమె భర్త గాలి అప్పలరెడ్డి సోమవారం రాత్రి కత్తితో నరికి హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం భార్యభర్తలిద్దరూ కలిసి ఉదయం కూలి పనికెళ్లారు. తర్వాత ఇంటికి వచ్చాక ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం మత్తులో ఉన్న భర్త కత్తితో హత్య చేశాడు. అనంతరం అప్పలరెడ్డి పోలీసులకు లొంగిపోయాడు.ఘర్షణకు కారణం తెలియాలి.

News March 18, 2025

ముక్కలుగా నరికి మూట కట్టారు

image

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో మహిళను ముక్కలుగా నరికి మూట కట్టేసి పడేశారు. దారుణంగా శరీర భాగాలు కట్ చేసి పడి ఉండడంతో స్థానికులు భయాందోళన చెందారు. దుప్పట్లో నడుము కింది భాగం, ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!