News April 8, 2025
కాకినాడ: భారత్-అమెరికా సైనిక విన్యాసాలకు బందోబస్తు

కాకినాడ రూరల్ తీర ప్రాంతం వద్ద మంగళవారం ఉదయం నుంచి 13వ తేదీ వరకు భారత్-అమెరికా వాయుసేన విన్యాసాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి నావెల్ ఎన్క్లేవ్ వద్ద అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్యకృష్ణ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 130 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 13వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్ళింపు ఉంటుందన్నారు.
Similar News
News April 8, 2025
ఎల్లుండి మాంసం దుకాణాలు బంద్

జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి(APR 10) సందర్భంగా ఎల్లుండి మాంసం దుకాణాలు మూసివేయాలని GHMC కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. మటన్, బీఫ్ ఇతర మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లకు సూచించారు.
News April 8, 2025
కందుకూరులో కనిగిరి యువకుడి ఆత్మహత్య

కందుకూరు పట్టణంలో కనిగిరి యువకుడు ఉరేసుకున్నాడు. కల్లూరి శివ నాగరాజు(26) కందుకూరు పోస్టాఫీస్ సెంటర్‌కు సమీపంలోని వెంకటరమణ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కనిగిరిలో క్రికెట్ బెట్టింగ్ వేసి అప్పులపాలై కందుకూరులో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
News April 8, 2025
అడ్డాకుల: శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం ఎంతంటే..?

దక్షిణ కాశీగా పిలవబడే అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగిశాయి. దేవాలయ శాఖ ఇన్‌స్పెక్టర్ వీణాద్రి ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు చేపట్టారు. లెక్కింపులో భాగంగా రూ.5,13,368 సమకూరినట్టు ఆలయ ఈవో రాజేశ్వర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు నాగిరెడ్డి, రవీందర్ శర్మ, దామోదర్ రెడ్డి, శ్రీహరి, నరేందర్ చారి, కొత్త కృష్ణయ్య పాల్గొన్నారు.