News March 12, 2025

కాకినాడ: మంత్రి నాదెండ్లను కలిసిన కలెక్టర్ షాన్ మోహన్

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ గత కొద్దిరోజులుగా కాకినాడలోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోర్టు నుంచి రవాణా అవుతున్న బియ్యం తరలిపోకుండా తీసుకుంటున్న చర్యలు కలెక్టర్ మంత్రికి వివరించారు. పీడీఎస్ బియ్యం విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆయనకు సూచించారు.

Similar News

News November 6, 2025

ఇవాళ అమరావతికి సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు లండన్ పర్యటన ముగిసింది. నిన్న రాత్రి 7.30 గంటలకు లండన్ నుంచి స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. ఉదయం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమరావతికి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో భేటీ కానున్నారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

News November 6, 2025

సిద్దిపేటలో ఈనెల 7న మినీ జాబ్ మేళా

image

సిద్దిపేటలోని సెట్విన్ కేంద్రంలో ఈ నెల 7న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రాఘవేందర్ తెలిపారు. ఈ మేళాలో హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో పలు ఖాళీ పోస్టుల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

News November 6, 2025

అయితే ఆరిక, కాకుంటే కంది, దున్ని చల్లితే శనగ

image

వాతావరణం, నేల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆరిక(చిరు ధాన్యాల) పంట బాగా పండుతుంది. ఒకవేళ పరిస్థితులు అంతగా అనుకూలించకపోయినా కంది పంట ఎలాగోలా పండుతుంది. భూమిని బాగా దున్ని, శ్రద్ధగా విత్తనాలు చల్లితే, శనగ పంట తప్పకుండా మంచి దిగుబడినిస్తుంది. ఈ సామెత ముఖ్యంగా వివిధ పంటలకు అవసరమైన శ్రమ, దిగుబడి, హామీ గురించి వివరిస్తుంది. శనగ పంటకు మంచి భూమి తయారీ, శ్రద్ధ అవసరమని చెబుతుంది.