News April 24, 2024
కాకినాడ: మహిళను ఢీకొట్టిన కాలేజ్ బస్సు.. మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట RTC కాంప్లెక్స్‌లో ఓ మహిళను ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టగా ఆమె మృతిచెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. కాంప్లెక్స్‌లో బస్సును మలుపు తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా మహిళను ఢీకొట్టిందన్నారు. మృతిచెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉంది.
కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి ప్రవేశం లేకపోయినప్పటికీ.. ఎందుకు వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 24, 2024
కాకినాడ: టీచర్‌ను కొట్టుకుంటూ తీసుకెళ్లారు
కాకినాడలోని ఓ మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. గుడ్ టచ్.. బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించేందుకు పాఠశాలకు వచ్చిన మహిళా పోలీసులకు తమ ఒంటిపై చేతులు వేసి టీచర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు టీచర్‌కు దేహశుద్ధి చేశారు. పోలీసులు వారికి సర్దిచెప్పి ఉపాధ్యాయుడిని పీఎస్‌కు తరలించారు.
News November 23, 2024
రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.
News November 23, 2024
లక్కీఛాన్స్ కొట్టిన పి.గన్నవరం వాయిస్ ఆర్టిస్టు
నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, నెట్ ఫ్లెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో ప్రచారం కానున్న ఆజాదీకా అమృత కహానియా డాక్యుమెంటరీకి తెలుగు భాష నుంచి వాయిస్ ఆర్టిస్టుగా పి.గన్నవరానికి చెందిన అడ్డగళ్ల రాధాకృష్ణను శుక్రవారం ఎంపిక చేశారు. 8 భాషలకు 8 మందిని బెస్ట్ వాయిస్ ఆర్టిస్టులను ఎంపిక చేయగా తెలుగు భాష నుంచి ఆ అవకాశం రాధాకృష్ణకు దక్కింది. ఈయన గతంలో పలు టీవీల్లో న్యూస్ రీడర్‌గా పనిచేశారు.