News January 25, 2025

కాకినాడ: మహిళను వేధించి హత్యాయత్నం.. జైలు

image

కాకినాడలోని వాకలపూడి వాసి వెంకన్న (25)కు రాజమండ్రి 8వ జిల్లా సెషన్స్ జడ్జి 9ఏళ్ల జైలు, రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా నిందితుడు ఓ మహిళను లైంగికంగా వేధించి , హత్యాయత్నం చేశాడని 2022లో అప్పటి ఎస్సై వి. మౌనిక కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించింది.

Similar News

News December 11, 2025

నంద్యాల జిల్లా మంత్రులకు మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రులకు CM చంద్రబాబు <<18527900>>ర్యాంకులు<<>> ప్రటించిన విషయం తెలిసిందే. NMD ఫరూక్‌కు 3వ, BC జనార్దన్ రెడ్డికి 4వ ర్యాంకు ఇచ్చారు. అత్యధిక ఫైళ్ల (ఫరూక్ 1,512, బీసీ 1,091)ను తక్కువ సమయంలో క్లియర్ చేసినందుకు ఈ ర్యాంకులు పొందారు. అయితే గ్రౌండ్ లెవెల్లో వారి పనితనం ఎలా ఉంది? స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపుతున్నారా? సీఎం ఇచ్చిన ర్యాంకులను మీరు సమర్థిస్తారా? మీ ర్యాంక్ ఎంత? కామెంట్ చేయండి.

News December 11, 2025

జగిత్యాల: ఉదయం 9 వరకు 16.67% పోలింగ్

image

జగిత్యాల జిల్లాలో జరుగుతున్న సర్పంచ్, వార్డు ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 16.67% పోలింగ్ నమోదైంది. మొత్తం 2,18,194 మంది ఓటర్లలో 36,377 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. భీమారం మండలంలో 21.59%, మేడిపల్లిలో 20.83%, కొరుట్లలో 17.74% మెట్‌పల్లిలో 17.69% పోలింగ్ నమోదైంది. ఇబ్రహీంపట్నం 15.86%, కథలాపూర్ 14.87%, మల్లాపూర్లో 12.66% ఓటింగ్ జరిగింది. కాగా, జిల్లాలో శాంతియుతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి.

News December 11, 2025

నిర్మల్ జిల్లాలో 16.57 పోలింగ్ నమోదు

image

నిర్మల్ జిల్లాలో జరుగుతున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గురువారం ఉదయం 9 గంటల వరకు ఆరు మండలాల్లో కలిపి మొత్తం 16.57 శాతం పోలింగ్ నమోదైంది. మండలాల వారీగా చూస్తే.. దస్తూరాబాద్‌లో 20.13 శాతం, కడెం 18 శాతం, ఖానాపూర్ 20.30 శాతం, లక్ష్మణచందా 10.92 శాతం, మామడ 15.73 శాతం, పెంబి 15.63 శాతం పోలింగ్ నమోదైంది.