News June 17, 2024
కాకినాడ: మహిళ దారుణ హత్య

మహిళ దారుణహత్యకు గురైన ఘటన కాకినాడ గ్రామీణ మండలంలో జరిగింది. సర్పవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యారావుపేటకు చెందిన ఓలేటి నరసింహమూర్తికి 8ఏళ్ల క్రితం సీత(26)తో పెళ్లైంది. శనివారం రాత్రి అందరూ నిద్రించాక.. కరెంట్ పోయిందని సీత వేరేగదిలో నిద్రించింది. ఉదయంకల్లా హత్యకు గురైంది. భర్త పోలీసులకు ఫిర్యాదుచేశాడు. DSP హనుమంతరావు సిబ్బందితో అక్కడికి వెళ్లారు. భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
‘వందేమాతరం గీతం’ వార్షికోత్సవం నిర్వహించాలి: కలెక్టర్

దేశభక్తి గీతం వందేమాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈనెల 7న జిల్లా వ్యాప్తంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2025 ప్రకారం, జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్, మండల, గ్రామ స్థాయిల్లో ఒకే సమయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ఆమె అధికారులకు సూచనలు జారీ చేశారు.
News November 7, 2025
రిజర్వ్ ఫారెస్ట్‌లో నగర వనం: డీఎఫ్‌వో

జాతీయ రహదారిని ఆనుకుని దివాన్ చెరువులోని రిజర్వ్ ఫారెస్ట్ లో 125 ఎకరాల విస్తీర్ణంలో రూ.రెండు కోట్లు వ్యయంతో నగరవనాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆర్కిటెక్ట్ గౌరీ శంకర్‌తో కలిసి ఫారెస్ట్ డీఎఫ్ఓ ప్రభాకరరావు గురువారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వచ్చే పుష్కరాలు నాటికి ఇది సిద్ధమవుతుందని డీఎఫ్ఓ తెలిపారు.
News November 7, 2025
నిడదవోలు: పీఎంజేవైలో 757 ఇల్లు మంజూరు

జిల్లాలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంత వాసులకు 757 గృహాలు మంజూరైనట్లు జిల్లా గృహ నిర్మాణ శాఖాధికారి ఎం. బుజ్జి తెలిపారు. ఆమె గురువారం నిడదవోలు మండలంలో క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పీఎంఏవై పథకం కొత్త మార్గదర్శకాలు విడుదలైనట్లు ఆమె పేర్కొన్నారు. నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీలతో పాటు రాజమహేంద్రవరం నగర కార్పొరేషన్ పరిధిలోని లబ్ధిదారులకు ఈ గృహాలు అందుతాయని వెల్లడించారు.


